Home

»

Latest News

బంధాలు - బంధుత్వాలు చుట్టూ `ద‌ళ‌ప‌తి 66`!?

Apr 21, 2022 3:05PM

`ఊపిరి` (2016) త‌రువాత ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి.. మ‌రోసారి బైలింగ్వ‌ల్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.  స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో వెర్సటైల్ యాక్ట‌ర్ శ‌ర‌త్ కుమార్ ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే, `ద‌ళ‌ప‌తి 66` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా తాలూకు స్టోరీ లైన్ పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ``బంధాలు, బంధుత్వాలు ముఖ్యం.. అంతా క‌లిసిక‌ట్టుగా ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించుకోగ‌లం`` అనే పాయింట్ చుట్టూ ఈ భారీ బడ్జెట్ మూవీని తీర్చిదిద్దుతున్నార‌ట వంశీ. అదే గ‌నుక నిజ‌మైతే.. గ‌తంలో ప‌లు ఫ్యామిలీ డ్రామాల‌తో మెస్మ‌రైజ్ చేసిన‌ విజ‌య్.. వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లోనూ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి. అలాగే, కుటుంబ క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన `దిల్` రాజు కూడా మ‌రో `ఫ్యామిలీ` హిట్ ని క్రెడిట్ చేసుకుంటారో?  లేదో? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

కాగా, యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందిస్తున్న `ద‌ళప‌తి 66`.. ఈ ఏడాది దీపావ‌ళికి గానీ లేదంటే 2023 సంక్రాంతికి గానీ సిల్వ‌ర్ స్క్రీన్ పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com